ఎస్సీ కమిషన్‌ సభ్యుడిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కమిషన్‌ సభ్యుడిని కలిసిన కలెక్టర్‌

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

జ్యోతినగర్‌: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఎన్టీపీసీ జ్యోతిభవన్‌ గెస్ట్‌హౌస్‌లో కలిసిన కలెక్టర్‌.. జిల్లాలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

అక్షితరాణి కుటుంబానికి భరోసా

గోదావరిఖని: అక్షితరాణి కేసులో నిర్లక్ష్యానికి తావులేకుండా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. ఇటీవల హత్యకు గురైన గోదావరిఖనిలోని లెనిన్‌నగర్‌కు చెందిన అక్షితరాణి కుటుంబాన్ని ఏసీపీ రమేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని శాసీ్త్రయ ఆధారాలతో దర్యాప్తు చేపడతామని, తద్వారా నిందితులకు కోర్టులో కఠిన శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలు సేకరిస్తామని, ఈమేరకు అధికారులు ముందుకెళ్లాలని సీపీ సూచించారు.

భక్తిశ్రద్ధలతో మాసకల్యాణం

కమాన్‌పూర్‌: స్థానిక శ్రీఆదివరాహస్వామి సన్నిధిలో బుధవారం మాస కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యణం తంతు తిలకించడానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు.

నిమజ్జన ప్రాంతం పరిశీలన

గోదావరిఖని: గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేసే గోదావరి వంతెనను రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు, శోభాయాత్ర మార్గం, భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ, సౌకర్యాలపై అధికారులు, నిర్వాహకులతో సమీక్షించారు. సీపీ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ, ఏసీపీ రమేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి, సింగరేణి తదితరులు ఉన్నారు.

‘ఎల్లంపల్లి’ నీటి విడుదల

రామగుండం: వినాయక నిమజ్జనం సందర్భంగా గోదావరిలో నీటినిల్వల కోసం ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బుధవారం సాయంత్రం నీరు విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిని నీరు అడుగంటి వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారడంతో అధికార యంత్రాంగ, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌ స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 3,312 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఫలితంగా గోలివాడ, లింగాపూర్‌, గోదావరిఖని, మంథని తదితర గోదావరి పరీవాహాక ప్రాంతాల్లో గణపతి నిమజ్జన వేడుకలు సాఫీగా సాగుతున్నాయి.

రూ.50వేలు పలికిన గణపతి లడ్డూ

రామగిరి: కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని గోకుల్‌నగర్‌లో మట్టి గణపతి లడ్డూను బుధవారం వేలం వేశారు. గోకుల్‌నగర్‌ యూత్‌ సభ్యులు రూ.50,516లకు పాడి లడ్డూ దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన భక్తుడు బుట్టి రాజయ్య రూ.20,016కు వేలం పాడి కలశం దక్కించుకున్నారు. యూత్‌ సభ్యులు గడ్డి శ్రీకాంత్‌, ఊరడి రమేశ్‌, ఓర్రె రమేశ్‌, కురుమల్ల శ్రీనివాస్‌, కురుమల్ల రమేశ్‌, కొయ్యడ స్వామి, కొయ్యడ పరుశురాం, కోయ్యడ కుమార్‌, గడ్డి హరీశ్‌, ఓర్రె హరీశ్‌, గొనె రాము, ఊరడి రాము, జంగ శేఖర్‌, బుట్టి శ్రీధర్‌, చిగురు రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement