అధికారుల ఫీవర్ సర్వేలోవెలుగులోకి
ఆస్పత్రులకు పేషెంట్ల పరుగులు
పెద్దపల్లి: జిల్లాలో విషజ్వరాలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. 8 డెంగీ కేసులు కూడా నమోదైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపా రు. పారిశుధ్య లోపం, ఇళ్లచుట్టూ నీటినిల్వలు, దో మల వృద్ధి తదితర కారణాలతో విషజ్వరాలు, సీ జనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మంథని, సుల్తానాబాద్, రామగుండం సర్కారు ఆస్పత్రుల్లో పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు.
రోజువారీ ఫీవర్ సర్వే
జ్వరాల నియంత్రణ కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తోంది. వ్యాధిగ్రస్తులను గుర్తించి పరీక్షలు చే యడంతో పాటు చికిత్స అందిస్తున్నారు. నీటి నిల్వలను తొలగించడంతోపాటు పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈమేరకు మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటిస్తున్నారు. అయితే, ఫీవర్ సర్వే పేరు నామమాత్రంగానే సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.


