బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమే లక్ష్యం

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

● పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

● పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

గోదావరిఖని: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌లోని కేసీఆర్‌ నివాసంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, సీనియర్‌ నాయకులు కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డితో కేటీఆర్‌ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తిపలికి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు. మాజీ మంత్రికొప్పుల ఈశ్వర్‌ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం నెలకొల్పి పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వ హించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement