పూర్తిగా పండిన తర్వాతే కోత | - | Sakshi
Sakshi News home page

పూర్తిగా పండిన తర్వాతే కోత

Jul 3 2026 11:56 PM | Updated on Jul 3 2026 11:56 PM

ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన తర్వాత సాధారణంగా మూడేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. అయితే, రైతులు పూర్తిగా పండిన గెలలు మాత్రమే కోయాలి. కోసిన 24 గంటల్లోగా ఫ్యాక్టరీకి తరలిస్తే నూనెశాతం అధికంగా లభిస్తుంది. ఈ దిశగా రైతులు సిద్ధంగా ఉండాలి. తద్వారా నాణ్యమైన పంట చేతికి వస్తుంది.

– శ్యాంప్రసాద్‌, జిల్లా ఉద్యాన అధికారి

నేనూ సాగు చేస్తున్నా

ఎలిగేడు మండలం శివపల్లిలోని నా సొంత రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్‌ మొక్కలు ఇటీవల నాటించా. వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటల కన్నా ఆరుతడితోపాటు ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. ఈలోగా అంతర్‌ పంటలు వేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

– విజయరమణారావు, ప్రభుత్వ విప్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement