స్పందించిన దాతలు | - | Sakshi
Sakshi News home page

స్పందించిన దాతలు

Jul 3 2026 11:56 PM | Updated on Jul 3 2026 11:56 PM

జ్యోతినగర్‌: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మల్కాపూర్‌ గ్రామానికి చెందిన మానాల విరాట్‌ కు టుంబానికి రామగుండం స్వ చ్ఛంద సంస్థల ఐక్యవేదిక శ్రీ సీతారామ సేవా సమితి స భ్యులు శుక్రవారం రూ.10వేలు సాయం చేశా రు. ‘నా బిడ్డకు ప్రాణం పోయండి’ శీర్షికన గతనెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది, స్పందించిన ప్రతినిధులు.. బాధితుడి తల్లిదండ్రులు మానాల స్వప్న – తిరుమలేశ్‌కు ఈ సా యం చేశారు. సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఫైట్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్‌, శ్రీభగవతీ హెల్పింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు కంకటీ రవిగౌడ్‌, లెనిన్‌, శ్రీనివాస్‌, కంది సుజాత, సరిత, లక్ష్మి, బిల్లా శ్రీదేవి, శారద, కొండు రమాదేవి, సుశీల పాల్గొన్నారు.

అభ్యసన తీరు పరిశీలన

మంథని: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన తీరును జిల్లా విద్యాశాఖాధికారి శా రద, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ షేక్‌ శుక్రవారం పరిశీలించారు. స్పాట్‌ అసెస్‌మెంట్‌ ని ర్వహించి విద్యార్థుల అభ్యాస స్థాయి అంచనా వేశారు. ప్రీ ప్రైమరీ విభాగాన్ని సందర్శించి అ భ్యాస వాతావరణం పరిశీలించారు. ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్య సాధనకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఉన్నారు.

జీవో 17ను రద్దు చేయాలి

పెద్దపల్లి: జీవో నంబర్‌–17ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకురాలు దాసరి ఉష డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్ర హం వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీ ఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఉష మాట్లాడుతూ, ప్రభుత్వ పా ఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు దుస్తులు, నోట్‌ బుక్కులు అందకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ ప్ర భుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మా జీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆ రోపించారు. నాయకులు రవి, ని ఖిల్‌, అజీమ్‌, కన్నం శ్రావణ్‌, శంకర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

‘కో ఆప్షన్‌’ ఎంపిక ఎప్పుడు?

సుల్తానాబాద్‌రూరల్‌: పంచాయతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. పంచా యతీరాజ్‌ చట్టం ప్రకారం.. పంచయతీ పాలకవర్గ కోలువదీరిన నెలరోజుల్లోగా కో ఆప్షన్‌ స భ్యులను ఎన్నుకోవాలని చెబుతోందని అధికారులు అంటున్నారు. ఒక్కో పంచాయతీలో ము గ్గురికి కో ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం దక్కతుంది. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ముగ్గురు చొప్పున ఎన్నుకుంటే 789 మందికి పదువులు దక్కే అవకాశం ఉంటుంద ని భావిస్తున్నారు. ప్రభుత్వం కో ఆప్షన్‌ సభ్యు ల ఎంపికకు ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

బాధ్యతతో పనిచేయాలి

పాలకుర్తి: వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో పవిత్ర అన్నారు. బసంత్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవా రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా, శివు ఆరోగ్య సేవలు మెరుగుపర్చి, గర్భిణులు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చే యాలని సూచించారు. వైద్యురాలు శారళి, ఎంఎల్‌టిటీ మధు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

5న విరసం సదస్సు

పెద్దపల్లి: హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 5న జరిగే ఆవిర్భావ సదస్సు ను విజయవంతం చేయాలని విరసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కన్వీనర్‌ బాలసాని రాజయ్య, సీఎల్‌సీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కు మారస్వామి, ప్రతినిధి మార్వాడి సుదర్శన్‌ కో రారు. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ప్రజాసంఘాల నాయకులతో కలిసి శుక్రవారం ప్ర చార పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతినిధులు గాండ్ల మల్లేశం, దేవి సత్యం, ఐత బాపు, నంబయ్య, శ్రీపతి రాజగోపాల్‌, బండి శంకర్‌ గౌడ్‌, అయిందాల అంజన్న, బట్టారి ఆంజనేయస్వామి, గంగారాజ్‌, ఆజాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement