పెద్దపల్లి: మాతృ మరణాలు సంభవించకుండా అ ప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో శ్రీహర్ష మాట్లాడారు. గర్భిణులకు ప్రతీనెల క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయాలని, హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీఎమ్మార్‌పై నిర్వహించిన స మీక్షలోనూ మాట్లాడుతూ, ఎఫ్‌సీఐ గోదాముల్లో రే క్ మూమెంట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో పవిత్ర, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, డీసీఎస్‌వో శ్రీనాథ్, డీఎం శ్రీకాంత్, సివిల్ సప్లయ్ డీఎం రవికుమార్, రైస్‌మిల్లర్లు జయపాల్‌రెడ్డి, కేశవరావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
ఓదెల: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తిచేయా లని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మండలంలో ఆ యన పర్యటించారు. ఈనెల 15లోగా ఇందిరమ్మ ఇ ళ్ల పెండింగు పనులను పూర్తిచేయాలన్నారు. సర్పంచులు పల్లె కనుకయ్య, కనికిరెడ్డి సతీశ్, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్‌రెడ్డి, డీఈఈ పద్మ, ఏఈఈ సచిన్, కార్యదర్శులు శంకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆహార భద్రతపై రాజీలేవు
కోల్‌సిటీ/పెద్దపల్లి: సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, పరిశుభ్రత, వ డ్డింపు వంటి అంశాల్లో నిబంధనలను పాటించా లన్నారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వా టిని తాత్కాలికంగా మూసివేసి, లోపాలను సరిదిద్దిన తర్వాతే అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. మే 29న మంథని మార్కెట్‌ని శ్రీసాయి ఫ్యామిలీ రె స్టారెంట్ అండ్ మెస్, జూన్ 13న గోదావరిఖనిలోని డెస్టినేషన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించి మూసివేశారని, నిర్వాహకులు మార్పులు చేపట్టడంతో పునఃపరిశీలన అనంతరం శ్రీసాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్‌కు జూన్ 4న, డెస్టినేషన్ రెస్టారెంట్‌కు జూన్ 30న కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


