గోదావరిఖని: ఓటరు జాబితాలోని అర్హులైన వారందరి పేర్లు నమోదైయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు, బీఎల్ ఏ ఇన్‌చార్జిలు కృషి చేయాలని రామగుండం ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ పురోగతి, బీఎల్‌ఏ లు చేపట్టాల్సిన బాధ్యతలు, ప్రజలకు అందించా ల్సిన సహకారంపై చర్చించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
కోల్‌సిటీ: రామగుండం గురుకుల పాఠశాల సమీపంలోని 27 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్ల వ్య యంతో చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాజెక్టు నమూనాను తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏఈ నరేశ్, ఎంవీఆర్ కన్‌స్ట్రక్షన్ సీఈవో విజయ్‌కుమార్, ఇంజినీర్ మస్తాన్ ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌ను కలిశారు. ప్రాజెక్టు మ్యా ప్ చూపించారు. ఎమ్మెల్యే.. మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌లో అత్యాధునిక తరగతి గదు లు, విశాలమైన క్రీడా మైదానాలు, సీనియర్, జూని యర్ విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు, అధ్యాపకులు, సిబ్బందికి నివాసాలు, తల్లిదండ్రుల కోసం వెయిటింగ్ హాల్స్ తదితర వసతులు కల్పిస్తామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారాన్నరు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


