పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తొలిదశలో ఇళ్ల నిర్మాణం పూర్తి చే సుకుని గృహ ప్రవేశం చేసిన కుటుంబాల్లో ఆనందం చూస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది గర్వకారణమన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాసీ్త్రనగర్, పూసాలలో ని ర్మాణం పూర్తిచేసుకొన్న లబ్ధిదారులు శుక్రవారం గృహ ప్రవేశాలు చేయగా.. విజయరమణారావు హాజరయ్యారు. ఈనెలలో రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. ఎన్నికల మెనిఫెస్టో లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెలబెట్టుకుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు అన్యా యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మా టలు చెప్పేది కాదని, చేతల్లో చూపెడుతోందని అ న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


