పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీరో నమోదు, 15లేదా అంతకంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలల నుంచి వచ్చే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫి కెట్ (టీసీ) దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్లియర్ చేయాలని అన్నారు. నిబంధనలు పా టించని, సహకరించని ప్రైవేట్ పాఠశాలలకు వివరణ కోరుతూ చర్యలు ప్రారంభించాలని ఆదేశించా రు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి మల్లేశ్‌గౌడ్, మండల విద్యాధికారులు, సంబంధిత ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు
కట్టుదిట్టంగా అమలు చేయాలి
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాలిందిని, డీఎంహెచ్‌వో పవిత్ర, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రవాణా శాఖ అధికారి కార్యాలయం తనిఖీ
పెద్దపల్లిలోని ఆర్టీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో అందుతున్న సేవలు, డైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అందించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, ఆర్టీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
పనుల్లో పురోగతి సాధించాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులోని బందంపల్లి చెరువు కట్టను మినీటాంకుబండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.3.14 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం చెరువు కట్ట పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమి షనర్ వెంకటేశ్, కౌన్సిలర్ పూరెళ్ల శైలజసుధాకర్, ఏఈ సతీశ్ మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.
చేపల చెరువులతో నిరుద్యోగ యువతకు ఉపాధి
గోదావరిఖని: సింగరేణి సంస్థ చేపల చెరువులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను ఆర్జీవన్ జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. వృథాగా ఉన్న చెరువులను పునరుద్ధరించి చేపల పెంపకానికి వినియోగించాలని సూచించారు. సింగరేణి అధికారులు బానోతు కర్ణ తదితరులున్నారు.
జీజీహెచ్ ఆస్పత్రి తనిఖీ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిని కలెక్టర్ శ్రీహర్ష గురువారం తనిఖీచేశారు. క్రిటికల్ కేర్ సెంటర్, పలు వార్డులు, ఇన్‌పేషెంట్ (ఐపీ) విభాగం, ల్యాబ్, ఎక్స్‌రే విభాగంతోపాటు ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహిస్తున్న ఎక్స్‌రే పరీక్షల వివరాలను తప్పనిసరిగా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని ఆదేశించారు.ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు, ఆర్‌ఎంవో కృపాబాయి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


