ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలు భేష్‌

Jul 3 2026 1:52 AM | Updated on Jul 3 2026 1:52 AM

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉ ద్యోగుల సాంకేతిక నైపుణ్యాలు భేషుగ్గా ఉన్నాయని ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ ముకుల్‌రాయ్‌ అన్నారు. గురువారం ప్రాజెక్టులో ఉద్యోగులు తయారు చేసిన రియల్‌ సైజ్‌ ఎల్‌టీ స్విచ్‌గేర్‌ శిక్షణ మాడ్యూల్‌ను ప్రారంభించారు. ఉద్యోగుల్లో ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడానికి, విద్యుత్‌ భద్రతపై అవగాహన బలో పేతం చేయడానికి, ప్రాజెక్టులోని ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక రియల్‌ సైజ్‌ ఎల్‌టి స్విచ్‌గేర్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. జీఎం అవిజిత్‌ దత్తా, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పీఎం ఇంటర్న్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర ధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని నిరుద్యోగ మైనారిటీ యువతీ యువకులు సద్వి నియో గం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి.నరేశ్‌కుమార్‌ నాయకుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు 6–9 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని, ఒ కేసారి ఇచ్చే గ్రాంట్‌ నెలకు రూ.9,000 చొ ప్పున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. 18–25 ఏళ్ల మధ్య ఉండి 10, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లొ మా, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు గడువు పెంపు

పెద్దపల్లి: రామగుండం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఏటీసీల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ పి.శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం రామగుండం ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

పెద్దపల్లి: పాలకుర్తి మండలం జయ్యారం పంచాయతీ కార్యదర్శి ఎస్‌డీ అమ్జద్‌ పాషాను సస్పెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్‌ మండలం పందిల్ల, పెద్దపల్లి మండలం కాపులపల్లి జీపీల్లో విధులు నిర్వహించిన సమయంలో సంబంధిత జీపీల రికార్డులను ఇంతవరకు అప్పగించకపోవడంతోపాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు మండల పంచాయతీ అధికారులు నివేదించినట్లు తెలిపా రు. ఈవిషయమై పూర్తి రికార్డులు అప్పగించాలని ఆదేశించినా స్పందన లేదని, ఎలాంటి వివరణ లేదని పేర్కొన్నారు. దీంతో అమ్జద్‌ పాషాను సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

ఖని నుంచి అయోధ్య, కాశీకి ప్రత్యేక ఆర్టీసీ బస్సు

గోదావరిఖనిటౌన్‌: పుణ్యక్షేత్రాలైన అయోధ్య, కాశీకి ఈనెల 15న గోదావరిఖని నుంచి ప్రత్యేక సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సు నడపనున్నట్టు ఖని డిపో మేనేజర్‌ కవిత తెలిపారు. 15న మధ్యాహ్నం ఒంటి గంటకు గోదావరిఖని నుంచి బయలుదేరి రాంటెక్‌ ప్రయాగరాజ్‌, అయోధ్య, కాశీ, గయా, బుద్ధ గయా, మైసూర్‌(శారదా శక్తిపీఠం) దర్శనం అనంతరం 7వ రోజు గోదావరిఖని చేరుకుంటుందని అన్నారు. ఒక్కరికి రూ.7100 చార్జి ఉంటుందని అన్నారు. భోజన, వసతులు ప్రయాణీకులే భరించాలని, మరిన్ని వివరాలకు సెల్‌.7013504982, 7382847596లలో సంప్రదించాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement