యాచకులపై.. ఆపరేషన్‌ ముస్కాన్‌ | - | Sakshi
Sakshi News home page

యాచకులపై.. ఆపరేషన్‌ ముస్కాన్‌

Jul 3 2026 1:52 AM | Updated on Jul 3 2026 1:52 AM

ప్రధాన చౌరస్తాల్లో సిగ్నల్‌ పడితే చాలు పసిపాపలను చంకనెత్తుకుని చంటి పిల్ల ఆకలి తీర్చమని వేడుకుంటూ వాహనదారుల వెంట పడుతున్నారు. చిన్నారులను సైతం వెంట పెట్టుకుని తిప్పుతున్నారు. గురువారం పెద్దపల్లి బస్టాండ్‌ చౌరస్తాలో చిన్నారులు రాజీవ్‌రహదారి డివైడర్‌ ఎక్కి లారీ డ్రైవర్‌ను యాచించడం ‘సాక్షి’కి కనిపించింది. ప్రాణాలు పోతాయంటూ అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసు వారించినా పెడ చెవిన పెట్టడంతో 1098కు సమాచారం అందించాడు. జిల్లా కేంద్రంలోని చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ సిబ్బంది బస్టాండ్‌ వద్దకు హుటాహుటిన చేరుకుని యాచిస్తున్న చిన్నారులను అదుపులోకి తీసుకుని చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపర్చారు. ఖమ్మం జిల్లా మంగళగూడెంకు చెందిన వారిగా గుర్తించి అమ్మమ్మ సాయంతో అక్కాచెల్లెళ్లు యాచిస్తున్నారని, వారి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి స్వగ్రామం పంపించామని చైల్డ్‌లైన్‌ సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement