జ్యోతినగర్: జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా గురువారం ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్‌షిప్‌లో మహిళలకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. ఏజీఎం సునీల్ అగర్వాల్, డీజీఎం విశ్వనాథ్‌లు పాల్గొని మాట్లాడుతూ గృహస్థాయిలో విద్యుత్ భద్రత ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించడంలో, కుటుంబాలు, సమాజ శ్రేయస్సును నిర్ధారించడంలో సాధారణ భద్రత జాగ్రత్తలు దోహదపడుతాయని తెలిపారు. అనంతరం విద్యుత్ భద్రత అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యురాళ్లు పాల్గొన్నారు.
విద్యుత్ భద్రత నిరంతర బాధ్యత
విద్యుత్ భద్రత నిరంతర బాధ్యత అని, అప్రమత్తతతో విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్ అన్నారు. గురువారం ప్రాజక్టులోని హెచ్‌ఆర్ ఆడిటోరియంలో జాతీయ విద్యుత్ వారోత్సవాల ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యుత్ భద్రత కేవలం పవర్ ప్లాంట్ కార్యకలాపాలకే పరిమితం కాదని, టౌన్‌షిప్‌లు, కార్యాలయాలు, ఇళ్లలో కూడా ఇది అంతే ముఖ్యమని అన్నారు. ప్రాజెక్టులో వారం రోజుల పాటు జరిగిన భద్రతా అవగాహన, ఆచరణాత్మక ప్రదర్శనలు, క్విజ్ తతదితర పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎంలు మనిష్ అగర్వాల్, అవిజిత్ దత్తా, బినోయ్ జోష్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, దీప్తి మహిళా సమితి సభ్యురాళ్లతో పాటు వివిధ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.


