గోదావరిఖని: ప్రభుత్వం జోక్యం చేసుకొని సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. గురువారం ఆర్జీ–1 జీఎం ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అధికారుల సంఘం నాయకులను కలుసుకొని సంఘీభావం తెలిపారు. పీఆర్‌పీ కోసం అధికారులు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిలే దీక్షలకు దిగారన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రాంమూర్తి, పూదరి సత్యనారాయణ, అధికారుల సంఘం నేతలు పెరుమాళ్ల శ్రీనివాస్, కోల మల్లేశం, దామోదర్ తదితరులున్నారు.
ఆర్జీ–2జీఎం ఆఫీస్ ఎదుట..
సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులు చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఆర్జీ–2 ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.


