పాఠాలు చెప్పి చెప్పి అలసిపోయినట్టున్నాడు పెద్ద సార్ అనుకుంటున్నారా.. లేక ఆలోచించి అలా సేదతీరుతూ నిద్రలోకి జారుకున్నాడు.. ఏదైనా అనుకోండి నిద్ర మాత్రం కప్పుకొచ్చింది సార్‌కి.. ఇదేం పద్ధతి సారు పాఠాలు చెప్పాల్సిన మీరే చదువుల ఆలయంలో కునుకు తీయడం ఏంటని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నదే 15మంది విద్యార్థులు. ఇద్దరు టీచర్లు. ఒకరు (ఉపాధ్యాయిని) పాఠాలు బోధిస్తుంటే ఇంకో సార్ తన చాంబర్‌లో తన కుర్చీలో నిద్రలోకి జారుకుని సాక్షి కెమెరాకు కనిపించాడు. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


