పెద్దపల్లి: ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కుదించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శేఖర్ ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల ముందుంచుతున్నందుకే లక్ష్యంగా చేసుకుని భద్రతను కుదించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. నాయకులు కల్లూరి నర్సయ్య, అరికిళ్ల ప్రసాద్, రవీందర్, నిరంజన్, మొలుమూరి వంశీ, నిఖిల్, అసంపల్లి రాకేశ్, తిరుపతి, సదయ్య, సతీశ్, శ్రీకాంత్, రాజేశ్, పోచం, మురళి తదితరులు పాల్గొన్నారు.


