మత్తు వదిలించేలా.. | - | Sakshi
Sakshi News home page

మత్తు వదిలించేలా..

Jul 1 2026 11:48 PM | Updated on Jul 1 2026 11:48 PM

గోదావరిఖని: డ్రగ్స్‌ విక్రయించడమే కాదు వినియోగించినా కటకటాలు లెక్కించాల్సిందే. గంజా యి రవాణా, విక్రయం, వినియోగం, డ్రగ్స్‌ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసుశాఖ.. గంజాయి పీల్చి తొలిసారి పట్టుబడితే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలిస్తోంది. అయినా మార్పు రాకపోతే జైలుకు పంపిస్తోంది. విక్రయదారులపైనా ఉక్కు పాదం మోపుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పో లీస్‌ ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పటిష్టం చేస్తోంది. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా వ్యాపారుల జాడలు గుర్తిస్తోంది.

కళాశాలల్లో ప్రత్యేక కమిటీలు

డ్రగ్స్‌, గంజాయి సమూల నిర్మూలన కోసం యువతలో అవగాహన కల్పించేందుకు స్కూళ్లు, క ళాశాలు, విద్యాలయాల్లో ప్రత్యేక కమిటీలు ఏ ర్పాటు చేస్తున్నారు. మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల ఆనవాళ్లపై తమకు సమాచారం అందించాలని పోలీస్‌ శాఖ కోరుతోంది. అంతేకాదు.. డ్రగ్స్‌తో కలిగే అనారోగ్య, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యల గురించి వివరిస్తోంది.

విక్రయదారులపై ఉక్కుపాదం

డ్రగ్స్‌ తయారీ, రవాణా, విక్రయ ముఠాలపై నిఘా పెట్టిన పోలీస్‌శాఖ.. తరచూ దాడులు చేస్తోంది. ఇతర రాష్ట్రాల సమన్వయంతో మాదకద్రవ్యాల రవాణా అరికడుతోంది.

వ్యసనపరులు డీ– అడిక్షన్‌ సెంటర్‌కు..

డ్రగ్స్‌ బానిసలు నేరస్తులు కాదని, వ్యవసనం నుంచి దూరం చేసేందుకు చికిత్స అవసరమని పోలీసుశాఖ సూచిస్తోంది. అంతేకాదు.. వారికి చికిత్స అందించేందుకు వైద్యశాఖ సమన్వయంతో డీ–అడిక్షన్‌(వ్యసన విముక్తి) కేంద్రాలకు తరలిస్తోంది. వివిధ సందర్భాల్లో చేపట్టిన తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడిన వారి మూత్రం శాంపిళ్లు సేకరిస్తోంది. పరీక్షల తర్వాత మత్తు తీసుకున్నారని నిర్ధారణ అయితే కేసు నమోదు చేసి 15రోజుల పాటు డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలిస్తోంది. ఇందు కోసం జిల్లాలో రెండు డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకటి, మార్కండేయకాలనీలో మరోటి ఉన్నాయి. వీటిలో సుమారు 25మందికి కౌన్సెలింగ్‌, వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఇందులోని వారు రెండోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటోంది.

డ్రగ్స్‌ విక్రయించినా, తాగుతూ రెండోసారి పట్టుబడినా..

వ్యసనపరులపై పోలీస్‌ శాఖ కఠిన చర్యలకు శ్రీకారం

పాఠశాలలు, కళాశాలల్లో నియంత్రణకు ప్రత్యేక కమిటీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement