ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

Jul 1 2026 11:48 PM | Updated on Jul 1 2026 11:48 PM

జ్యోతినగర్‌: ఎన్టీపీసీలో అత్యవసర సేవల అధికారులు, సిబ్బంది బుధవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. బూడిద కట్ట వద్ద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జీఎంలు ముకుల్‌ రాయ్‌, సంజయ్‌కుమార్‌, ఎన్‌కేశర్మ, సీఐఎస్‌ఎఫ్‌, అగ్నిమాపక అధికారులు పర్యవేక్షించారు. సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక, భద్రత, వైద్య, మానవ వనరులు, సివిల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ తదితర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గుడిసెల బతుకులు మారలే

పెద్దపల్లి: మార్పు తెస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ప్రజల గుడిసెల బతుకులు మారలేదని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కలవేని శంకర్‌ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి బుధవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో శంకర్‌ మాట్లాడారు. పేదలకు డబుల్‌బెడ్‌ రూ మ్‌ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. నాయకు లు గోశిక మోహన్‌, గౌతమ్‌ గోవర్ధన్‌, కనకరా జ్‌, మార్కాపూర్‌ సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్‌, కో డం స్వామి, బాలాసాని లెనిన్‌, శేఖర్‌, ఎల్ల య్య, సాయి, తిరుమల, రమేశ్‌, నవీన్‌, రేణిగుంట్ల ప్రీతం, మనోజ్‌ కుమార్‌, రాజయ్య, మోహన్‌, రమేశ్‌, కరీం పాల్గొన్నారు.

గనులపై జేఏసీ ధర్నా

గోదావరిఖని: బొగ్గుగని కార్మికుల 12వ వేతన ఒప్పందం ప్రక్రియ ప్రారంభించాలనే డిమాండ్‌తో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ బుధవా రం ఆర్జీ–వన్‌ ఏరియాలోని గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. వేతన ఒప్పందానికి అడ్డుగా ఉన్న నాలగు లేబర్‌కోడ్లను ర ద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. నూతన వేత న కమిటీని 40శాతం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌తో ఏర్పాటు చేసి ప్రక్రియ ప్రారంభించాలని డి మాండ్‌ చేసింది. జేఏసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్‌, రంగు శ్రీను, మాదన మహేశ్‌, సంకె అశోక్‌, బోగ సతీశ్‌ బాబు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో ఎమ్మెల్యే

గోదావరిఖనిటౌన్‌: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు, పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉన్న చెట్ల తొలగింపు పనులను అధికారులు చేప ట్టారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ బుధవారం పనులు పరిశీలించారు. ప్రయాణికుల భద్రత, వాహనాల పార్కింక్‌ను దృష్టిలో ఉంచుకొని చెట్లను తొలగిస్తున్నామన్నారు.

ఏడీఈగా శ్రీనివాస్‌

గోదావరిఖనిటౌన్‌: ఎన్పీడీసీఎల్‌ ఏడీఈగా జి.శ్రీనివాస్‌ తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏ ఈలు, విద్యుత్‌ సబ్బంది ఆయనకు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement