ఎలిగేడు: రైతులు పంట మార్పిడి పద్ధతిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన సొంత మూడెకరాల్లో బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. విప్ మాట్లాడుతూ, పంట మార్పిడి పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు తానే స్వయంగా ఆయిల్‌పామ్ తోటల పెంపకం చేపట్టామన్నారు. కలెకక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ఒంటరి మహిళలు, రెండ, మూడు ఎకరాలున్న మహిళలకు పూర్తిస్థాయి రాయితీతో ఆయిల్‌పామ్ మొక్కలు అందిస్తామన్నారు. సర్పంచ్ దుగ్యాల వాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, వ్యవసాయాధికారి శ్రీనివాస్, తిరుమల ఆయిల్ కంపనీ సీఈవో కేశుకల్యాణ్, ఉద్యాన అధికారులు మహేశ్, జ్యోతి, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఏవో ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్, శరణ్య తదితరులు పాల్గొన్నారు.
దసరా వరకు బస్సుడిపో ప్రారంభం
ఓదెల: దసరా పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. లంబాడితండా గ్రామపంచాయతీ భవనం ప్రారంభం, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, ఉపసర్పంచ్ గుగులోతు లింగేశ్, నాయకులు సాగర్‌రెడ్డి, పిట్టల రవికుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


