పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

Jul 1 2026 11:48 PM | Updated on Jul 1 2026 11:48 PM

మంథని: ఎస్‌ఐఆర్‌ ప్రకియను పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథనిలో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించా రు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, బీఎల్‌వోలు ప్రతీఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ అందజేసి, సక్రమంగా పూరించేలా అవగాహన కల్పించా లన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో సురేశ్‌, తహసీల్దార్‌ అరిఫోద్దిన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ పాల్గొన్నారు.

పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి

పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్‌/ఎలిగేడు: ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ పంపిణీ, సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ రెండోవార్డు, రెబ్బల్‌దేవ్‌పల్లి, ఎలిగేడు మండలం శివపల్లిలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయా కార్యక్ర మాల్లో తహసీల్దార్‌లు యాకన్న, బషీరోద్దీన్‌, ము న్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభానికి సిద్ధంగా

తహసీల్దార్‌ కార్యాలయం

కమాన్‌పూర్‌: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ భవనం తుదిదశ పనులను కలెక్టర్‌ శ్రీహర్ష పరిశీలించారు. ప్రారంభోత్సవానికి భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ వాసంతి, ఆర్‌ఐ స్రవంతి, పీఆర్‌ఏఈ జగదీశ్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement