రోహిణి కార్తెలోనే వరి మొలక చల్లేవాళ్లం. ఈసారి వానలు లేక బావుల్లో నీరు లేదు. అందుకే ఇప్పటివరకు నారుమడులు కూడా సిద్ధం చేయలే. ఏటా మూడెకరాలు సాగు చేసేవాడిని. ఈసారి ఎకరం కూడా సాగు చేసే పరిస్థితి లేదు.
– సామంతుల కొమురయ్య, కటికెనపల్లి
చెరువులో నీళ్లు లేవు
పెద్దపూర్ చెరువులోకి నీళ్లు రాలేదు. వర్షాలు లేక నార్లు పోయలేదు. గతేడాది ఇదే సమయానికి నాట్లకు సిద్ధమయ్యాం. ఇప్పుడు కాలం దాటిపోతంది. ఎప్పుడెప్పుడు మేఘాలు కరుణిస్తాయా అని ఆత్రుతగా చూస్తున్నాం.
– కంబళ్ల రాజమల్లు, అబ్బాపూర్
వర్షాలు లేవు
వర్షాలు లేక వరినారు సరిగా పెరగలేదు. ఇంకా నాటు వేయలేదు. మూడెకరాల్లో సాగు పూర్తిగా నిలిచిపోయింది. కరెంట్ కూడా రాత్రిళ్లే వస్తంది. పగలు త్రీఫేజ్ పరిమితంగానే ఇస్తున్నారు. వర్షాలు లేక మా పరిస్థితి దయనీయంగా మారింది.
– కొట్టిరెడ్డి రాజిరెడ్డి, ఓదెల


