పంటలకు అవసరమైన లోన్ కోసమని బ్యాంకు వెళితే ఈసీ, పహాణి కావాలన్నరు. వాటికోసం మీసేవకు వచ్చా. సైట్ ఓపెన్ కావడం లేదంటున్నరు. మూడు రోజుల నుంచి ఇలాగే తిరుగుతున్న.
– బియ్యాల కుమార్, వెన్నంపల్లి
సర్వర్ సతాయిస్తంది
మీసేవ కేంద్రానికి వివిధ సేవల కోసం వస్తున్నారు. సర్వర్ సతాయిస్తుండడం, పోర్టల్ ఓపెన్ కాక పోవడంతో ఇబ్బంది కలుగుతంది. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ సేవల సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.
– మహేందర్, మీసేవ నిర్వాహకుడు
రిజిస్ట్రేషన్ కాలేదు
రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వచ్చాం. ఉదయం నుంచి కార్యాలయం వద్దే వేచిచూస్తున్నాం. సర్వర్ పనిచేయడం లేదని చెప్పడంతో పనికావదంలేదు. వెనుదిరగాల్సి వచ్చింది. సమయం, డబ్బు వృథా అయ్యాయి.
– పురం ప్రసాద్, సుల్తానాబాద్


