అధికారుల రిలే దీక్షలు | - | Sakshi
Sakshi News home page

అధికారుల రిలే దీక్షలు

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

గోదావరిఖని: సింగరేణి అధికారులు తమ కు రావాల్సిన పీఆర్పీతోపాటు సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండోరోజూ కొనసాగాయి. ఆర్జీ– వన్‌ ఏరియాలో సీఎంవోఏఐ నాయకుడు దీటి చంద్రమౌళి తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఆర్జీ–2లో అధికారుల సంఘం అధ్యక్షుడు రాముడు దీక్షలు ప్రారంభించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్‌, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, టీజీబీకేఎస్‌ నేత కెంగెర్ల మల్లయ్య దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు.

శిక్షణ ప్రారంభం

గోదావరిఖనిటౌన్‌: అన్న–అక్క మెంటార్షిప్‌ రెండురోజుల శిక్షణను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ జై కిషన్‌ ఓజ మంగళవారం ప్రారంభించారు. బీఏ, బీకాం, బీఎ స్సీ ఐదో సెమిస్టర్‌, ఏఈడీపీ థర్డ్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ఆన్‌ ఏఐ, డిజిటల్‌ లర్నింగ్‌పై శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement