సర్పంచ్‌ పిల్లలు సర్కార్‌ బడికి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ పిల్లలు సర్కార్‌ బడికి

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

రామగిరి: నాగెపల్లి సర్పంచ్‌ కొండవేన దివ్య–సుధాకర్‌ దంపతుల కుమారుడు మాన్విక్‌(మూడోతరగతి), కుమార్తె రిశ్విత( రెండోతరగతి)ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంగళవా రం చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడుతుండటంతో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మార్పు తమతోనే మొదలవ్వాలని వారు అంటున్నారు. సర్పంచ్‌ దంపతులను గ్రామస్తులు అభినందించారు.

విప్‌ సహకారంతో అభివృద్ధి

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు సంపూర్ణ సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం కౌన్సిలర్లు జగదీశ్‌, శ్రీకాంత్‌తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీరోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ఏఈ సతీశ్‌తో కలిసి పర్యవేక్షించారు. నాయకులు దేవరాజ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారిగా పవిత్ర

పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖ(డీఎంహెచ్‌వో) గా పవిత్ర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎంహె చ్‌వోగా పనిచేసిన ప్రమోద్‌ కుమార్‌ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో సిరిసిల్లలో పనిచేస్తున్న పవిత్ర కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పవిత్రను ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రమోద్‌కుమార్‌ను పలువురు ఘనంగా సన్మానించారు.

నేడు ఇంటర్వ్యూ

పెద్దపల్లి: రామగుండం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని డీ –అడిక్షన్‌ సెంటర్‌లో ఖాళీగా ఉన్నఒక మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నామని జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబిందు సింగ్‌ తెలిపారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. జీజీహెచ్‌లో జరిగే ఇంటర్వ్యూలకు విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణపత్రం, ఇతర ఒరిజినల్‌ సర్టిఫెట్లతో హాజరు కావాలని సూచించారు.

రీ సర్వేతో ప్రయోజనం

పెద్దపల్లిరూరల్‌: పూర్వం నిర్ణయించిన గ్రామ సరిహద్దులు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను మరోసారి సర్వేయర్లతో పాటు డిజిటల్‌గా రీ – సర్వే చేయించేందుకు ప్రభుత్వం భూభారతి చేపట్టిందని ఆర్డీవో గంగయ్య అన్నారు. నిమ్మనపల్లి గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు ఆయన అవగాహన క ల్పించారు. రీ సర్వేకు అందరూ సహకరించాల ని కోరారు. తహసీల్దార్‌ రాజయ్య, డెప్యూటీ తహసీల్దార్‌ విజేందర్‌, సర్పంచ్‌ వేల్పుల రమేశ్‌, మాజీ సర్పంచ్‌ వేల్పుల మల్లికార్జున్‌రావు, కార్యదర్శి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచిత శిక్షణ

పెద్దపల్లి: టాస్క్‌ ఆధ్వర్యంలో 3 నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్‌ కోసం డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా పూర్తిచేసిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్‌ తెలిపా రు. ఎంఎస్‌ ఎక్సెల్‌, అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌, పవర్‌ బీఐ, బిజినెస్‌, పీఏ టూల్స్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి అంశా ల్లో శిక్షణ అందిస్తారని, వివరాల కోసం 90595 06807 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

అంతర పంటలు వేయాలి

పెద్దపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతరపంటలు సాగు చేయడం ఎంతోమేలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్యాంప్రసాద్‌ సూచించారు. కూరగాయలు తదితర పంటలు వేస్తే.. మల్చింగ్‌ షీట్లు, అరటి, బొప్పాయి, పసుపు వంటి ఉద్యాన పంటలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

నేడు ఎన్టీపీసీకి ఆర్‌ఈడీ

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌శర్మ బుధవారం రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు సందర్శిచనున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆయన రామగుండం రానున్నారు. సోలార్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించిన క్రమంలో ప్రాజెక్టు సందర్శనతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. ఈమేరకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement