పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

పెద్దపల్లి: వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో పాలకవర్గంతో ఆయన సమావేశమయ్యారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, వైస్‌చైర్‌ పర్సన్‌ అంతటి పుష్పలత, కమిషనర్‌ రమేశ్‌, కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, గాజుల రాజమల్లయ్య, కందునూరి సమత, గరిగె శోభారాణి, బాకంసాయి కిరణ్‌, ఉట్ల వరప్రదీప్‌, చింతలరాజు, తొర్రికొండ ప్రభాకర్‌, కల్వల శంకరమ్మ, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజుల తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతల సంక్షేమమే ధ్యేయం

జూలపల్లి: అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. అబ్బాపూర్‌, వడ్కాపూర్‌, తెలుకుంట రైతువేదికల్లో మంగళవారం వానకాలం పెట్టుబడి సాయం విడుదల చే సి మాట్లాడారు. సన్నవడ్లకు బోనస్‌, పెట్టుబడి సా యం పెంపు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, ఎరువులను అందుబాటులో ఉంచిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. డీఏవో శ్రీనివాస్‌, మండల వ్యవసాయాధికారి ప్రత్యూష, ఏఈ వో కిరణ్మయి, సర్పంచులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement