ధర్మారం: గురుకుల విద్యార్థులకు వసతుల కల్పన, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన నిధుల కేటాయంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సంక్షేమశాఖ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారం, భోజనం మెనూపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్‌హాల్, స్టోర్ రూం, బియ్యం, కూరగాయలు పరిశీలించారు. వసతులపై ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బియ్యంలో ఎక్కువశాతం నూక ఉన్నందున వెంటనే వెనక్కి పంపించాలని, సూపర్‌ఫైన్ బియాన్ని తిరిగి స్కూల్‌కు ఇప్పించాలని పౌర సరఫరాల అధికారికి ఆదేశాలు జారిజేశారు. గురుకులం విద్యాలయంలో మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు గందం మల్లయ్య, గందం మహిపాల్, ఎదుల్ల అంజయ్య, రామడుగు గంగారెడ్డి, బోనగిరి అజయ్ పాల్గొన్నారు.
సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


