గోదావరిఖని: అర్హులైన ప్రతీఓటరు వివరాలు జాబితాలో నమోదు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం సర్ ఇన్‌చార్జిలతో స మీక్షించారు. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. హోంగార్డులు తనను కలిసి సమస్యలు విన్నవించగా ఇలా స్పందించారు.
ఓటు పౌరుడి హక్కు
ఫెర్టిలైజర్‌సిటీ: ఓటుహక్కు ప్రతీపౌరుడి హక్కు అని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు. లక్ష్మీపూరంలో ఎ మ్మెల్యే సర్‌పై అవగాహన కల్పించారు. మేయర్ మ హంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్లు కందుల స్వరప, భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
యైటింక్లయిన్‌కాలనీ: సర్‌పై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు. అల్లూరు, అంబడి తండాలో చేపట్టిన సర్ సర్వేను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మారెల్లి సుశీల– రాజిరెడ్డి, శంకర్ నాయక్, కాంగ్రెస్ కాలనీ పట్టణ అద్యక్షుడు గుండేటి రాజేశ్ పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


