గోదావరిఖని: హైదరాబాద్‌లోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది మృతి చెందారని, ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించామని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కావాలనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నామన్నారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా మని మంత్రి తెలిపారు. పరిశ్రమ సీఎండీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని గుర్తుచేశారు. కొండగట్టులో జరిగిన ప్రమాదంలో 66 మంది భక్తులు చనిపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు ఎందుకు వెళ్లలేదని మంత్రి ప్రశ్నించారు. తాము రూ.50 లక్షల పరిహారం ఇప్పిస్తే.. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5లక్షలే ఇచ్చారన్నారు. పేపర్ లికేజీలు జరిగితే కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదో హరీశరావు సమాధానం చెప్పాల న్నారు. నాయకులు మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, దుబాసి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి


