న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి పెద్దపల్లి:
వేసవి సెలవులు ముగిశాయి. ఆటాపాటలకు విరామం వస్తోంది. దాదాపు మూడు నెలల తర్వాత పుస్తకాలు, బ్యాగులు పట్టుకుని విద్యార్థులు సోమ వారం బడిబాట పట్టనున్నారు. పాఠశాలల్లో వసతు లు కల్పించి నాణ్యమైన విద్య అందించడానికి ప్ర భుత్వం ‘మన ఊరు.. మన బడి’, అమ్మ ఆదర్శ పా ఠశాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎంపికైన స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తయినా.. కొన్నిచోట్ల అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. అసంపూర్తి పనులను సెలవుల్లో పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. శిథిలమైన భవనాలు, ప్రహరీలు, వి ద్యుత్, నీటి సౌకర్యం తదితర తదితర సమస్యలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా చాలాచోట్ల బడులు మద్యం ప్రియులకు అడ్డాలు గా మారాయి. తాగి పడేసిన ఖాళీ మద్యంసీసాలు చిన్నారుల భవిష్యత్‌కు ప్రతిబంధంగా మారాయి.
కలిసొచ్చిన కార్యక్రమాలు
గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ జిల్లాలోని 191, కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మరిన్ని స్కూళ్లలో సుదుపాయా లు మెరుగయ్యాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లను ఏర్పాటు చేసి అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పర్యవేక్షిస్తున్నారు. రూ.17కోట్లతో 418 స్కూళ్లలో మరమ్మతు, అభివృద్ధితోపా టు, పీఎంశ్రీ ద్వారా 16 స్కూళ్లలో ఆధునిక సౌకర్యా లు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో మనజిల్లా 230 మార్కులకు 135.2 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది.
14నుంచి బడిబాట
జిల్లాలో మొత్తం 547 స్కూళ్లు ఉండగా, సుమారు 50 వేలమంది చదువుతున్నారు. బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నా.. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లవైపే మెగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడు ల్లో సంఖ్య తగ్గుతూ వస్తున్నది. విద్యార్థుల సంఖ్య ఈసారి ఎలాగైనా పెంచేందుకు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
వసతుల్లో నంబర్ వన్
జిల్లాలోని దాదాపు అన్నిపాఠశాలల్లో వసతు లు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోనే మనజిల్లా టాప్ వన్‌లో ఉంది. వచ్చే సోమవారం పున:ప్రారంభంకానున్నాయి. విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తుకాలు, జతయూనిఫామ్ అందించేందుకు అన్నీ సిద్ధం చేశాం.
– శారద, జిల్లా విద్యాశాఖ అధికారి
ఇది నిజం : శిథిలమైన ఈ పెంకుటింట్లోనే మంథని మండలం కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఒకటినుంచి ఐదో తరగతి వరకు ఒకేగదిలో అరకొర సౌకర్యాల మధ్య విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు.
ఇవి ఇటీవల నిర్మించిన ఓదెల మండలంలోని
ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లే అయినా.. స్కావెంజర్లు
లేక నిర్వహణ గాడితప్పి దుర్గంధం వెదజల్లుతోంది.
ఇందులోని 70 మంది విద్యార్థులు దుర్వాసన
భరించలేకపోతున్నారు.


