డాక్టర్‌ శ్రీధర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శ్రీధర్‌ బదిలీ

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

పెద్దపల్లి: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ బదిలీ అయ్యారు. ఆయనను కమలాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. సాధారణ బదిలీల్లో భాగంగానే ఆయన ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్లు సమాచారం.

బాయిలర్‌ భద్రతపై అవగాహన

ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ కర్మాగారంలో సోమ వారం బాయిలర్‌ భద్రత పై బాయిలర్ల వరంగల్‌ రీ జియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమారావు సోమ వారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ, బాయిలర్‌ భద్రత నిబంధనల ను కచ్చితంగా పాటించాలన్నారు. తద్వారా ప్ర మాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ జీ ఎం(ఓఅండ్‌ఎం) ప్రేమ్‌కుమార్‌, బాయిలర్‌ ఆ పరేటర్లు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

పార్క్‌లో వ్యర్థాల సేకరణ

రామగుండం: అటవీశాఖ అధికారులు స్థానిక అర్బన్‌ పార్క్‌లో సోమవారం వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అందుకే వ్య ర్థాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపా రు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సతీశ్‌కుమార్‌, డి ప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ తిరుపతి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు నర్సయ్య, సతీశ్‌కుమార్‌, సయ్యద్‌ రహ్మతుల్లా, బీట్‌ ఆఫీసర్లు స్రవంతి, మేఘరాజ్‌, రామ్మూర్తి, మాధురి, పవన్‌కుమార్‌, వెంకటరాజం, అక్తర్‌పాషా తదితరులు ఉన్నారు.

నియామకం

మంథని: ఆర్యవైశ్య మహాసభ రాజకీయ క మి టీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా మంథని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎల్లంకీ వంశీధర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నుంచి ఆయన నియామకపత్రం అందుకున్నారు. వంశీధర్‌ నియామకంపై ఆర్యవైశ్య సామాజిక వర్గం, స్థానికులు, మిత్రులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చేపల మార్కెట్‌లో మృగశిర సందడి

పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్‌: మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా జిల్లాలోని సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌తోపాటు పెద్దపల్లి మార్కెట్‌లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి. కార్తె ప్రవేశం సందర్భంగా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకంతో చాలామంది కొనుగోళ్లకు వచ్చారు. డిమాండ్‌ అధికం కావడంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. బొమ్మె కిలోకు రూ.500 – రూ.600, బొచ్చె రూ.250 – రూ.350 వరకు విక్రయించారు. ధరలు పెంచినా వినియోగదారులు చేపలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

ఐక్య ఉద్యమాలే శరణ్యం

జ్యోతినగర్‌: ఐక్య ఉద్యమాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యు డు, ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ ని రంకుశత్వం, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రాజెక్టు గేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికులు తమ హక్కులు సాఽ దించేంత వరకు యూనియన్లు అండగా ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ తమ లక్ష్యమన్నారు. జేఏసీ నాయకులు చిలుక శంకర్‌, భూమల్ల చందర్‌, గీట్ల ల క్ష్మారెడ్డి, శంకర్‌, భూమయ్య, శ్రీనివాస్‌, సత్యం, పురుషోత్తం, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement