కాంగ్రెస్‌ పాలనలోనే రైతుసంక్షేమం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలోనే రైతుసంక్షేమం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

మద్దతు ధర కోసం ఐకేపీ కేంద్రాలను తెచ్చింది దివంగత సీఎం వైఎస్సారే మాజీమంత్రి హరీశ్‌ అబద్ధాలు ఆడడం ఇప్పటికైనా మానుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీ జేబు నింపుకునేందుకు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజం

పెద్దపల్లిరూరల్‌: రైతులకు సంక్షేమ పథకాల ఫలాలు అందించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రైతులకు మద్దతు ధర ఇప్పించాలనే ఆలోచనతో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించింది ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తుచేశా రు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. ఏకకాలంలో రూ.21వేల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు.

అబద్ధాల హరీశ్‌రావు..

మాజీమంత్రి హరీశ్‌రావు అంటేనే అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.కోట్ల విలువైన రైతుల శ్రమను కోతల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దయతోనే మీరు మంత్రులు, మీమామ సీఎం కాగలిగారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిన ఈసారి వరి, మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చినా, కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.

మీ జేబు నింపుకునేందుకే కాళేశ్వరం

‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీ జేబులు నింపుకునేందుకు.. దానికి మీ మామ కేసీఆర్‌ ఇంజినీర్‌ అయితే.. మీరు సబ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించారు.. దానిని కడితే అది మూణ్ణాళ్లకే కూలిపాయె.. ప్రపంచంలో ఇది ఎనిమిదో వింత అన్నట్టు బస్సులు పెట్టి అందర్నీ చూసిరమ్మని పంపితిరి’ అని విజయరమణారావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే తొలితడి పెద్దపల్లికే అని పలికి కనీ సం ఒక్కచుక్కనీరు కూడా ఇవ్వకుండా మీ బంధుగణం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల కే ఎత్తుకుపోయారని ధ్వజమెత్తారు. వచ్చే ఎ న్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని, సీఎంగా రేవంత్‌రెడ్డి మళ్లీ ఉంటారని అన్నా రు. మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, మార్కెట్‌చైర్మన్‌ మల్లారెడ్డి, నాయకులు సురేశ్‌గౌడ్‌, మస్రత్‌, కొమ్ము సుధాకర్‌, సాంబిరెడ్డి, జగదీశ్‌, నల్లగొండ కుమార్‌, స్వరూప, సంపత్‌, ధర్మయ్య, నర్సింగ్‌, అవినాష్‌, నరేశ్‌, గుజ్జుల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement