టీబీజీకేఎస్‌ శ్రేణుల్లో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌ శ్రేణుల్లో జోష్‌

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● హరీశ్‌రావు పర్యటనతో కార్మికుల్లో చర్చ ● సమస్యలపై ఉద్యమం ప్రకటించిన బీఆర్‌ఎస్‌

గోదావరిఖని: ‘కాంగ్రెస్‌ హటావో – సింగరేణి బచావో’ పేరిట ఆదివారం నగరంలో నిర్వహించిన సదస్సు విజయవంతం కావడం టీబీజీకేఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ముఖ్య నాయకులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, దివాకర్‌రావు, కోరుకంటి చందర్‌, పుట్ట మధు హాజరు కావడం, కార్మికుల సమస్యల పై స్పందించడంతో పా ర్టీ, యూనియన్‌ శ్రేణు ల్లో ఊపు వచ్చింది. సింగరేణిలో కారుణ్య ని యామకాలు నిలిచిపో యాయి. మెడికల్‌ పూర్త యిన సుమారు 400మంది కార్మిక వారుసలకు పోస్టింగ్‌ ఆ ర్డర్లు రాలేదు. కార్మికుల్లో ఆందోళన తీవ్రమైంది. మారుపేర్ల కార్మికులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వీరికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సరైన దారి చూపించడంలేదు. దీంతో వారిలోనూ అసంతృప్తి రగులుతోంది. కార్మికుల ముఖ్యమైన సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఉద్యమానికి సిద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రకటించడం కార్మికుల్లో భరోసా నింపినట్లయ్యింది.

ఆకట్టుకున్న పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్మిక సమస్యలపై ఉద్యమిస్తామని చెబుతూనే సింగరేణి స్థితిగతులపై సుమారు గంటపాటు ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా వివరించారు. భవిష్యత్‌లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ మనుగడ కష్టంగా మారుతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకోవడమే ఇందుకు కా రణమని, చివరకు నష్టపోయేది కార్మికులేనని గ ణాంకాలతో సహా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ చే యడం ఆసక్తి రేపింది. ఈనెల 12న భూ పాలపల్లిలోనూ సదస్సు నిర్వ హించి ఉద్యమానికి కార్మికులను సన్నద్ధం చేస్తామని ప్రకటించడం చర్చకు దారితీసింది. వాస్తవానికి కారుణ్య నియామకాలు నిలిచిపోవడం, బీఆర్‌ఎస్‌ ఉద్యమానికి సిద్ధం కావడంతో సింగరేణి కార్మికుల నుంచి మద్దతు వస్తోంది.

కార్మిక క్షేత్రమే కీలకం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గడువు ముగియడం, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ పెరుగుతూ వ స్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు సమక్షంలో నిర్వహించిన సదస్సు కార్మిక సంఘాల్లో ఊపుతెచ్చింది. కా ర్మిక సమస్యలపై ఉద్యమానికి అవి కూడా సిద్ధమవుతున్నాయి. గత చరిత్ర సమీక్షిస్తే.. ఇప్పవరకు సింగరేణి ఏరియాల్లో గెలిచిన ఎమ్మెల్యేల మాతృ సంస్థ లే అధికారంలోకి రావడంతో కార్మికులు కీలకంగా మారారు. ఈక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్మికుల సమస్యలపై గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత సైతం ఈనెల 15న గోదావరిఖని ప్రాంతంలో పర్యటిస్తారు. దీంతో అన్నిపార్టీల దృష్టింతా కార్మిక క్షేత్రంపైకే మళ్లింది. తద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.

సింగరేణి స్కాంలపైనే ప్రధాన దృష్టి

సింగరేణిలో స్కాంలపైనే బీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృిష్టి కేంద్రీకరించింది. ఈవిషయంలో కార్మికులను సన్నద్ధం చేసి కార్మిక క్షేత్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది. ఈక్రమంలో బెల్లంపల్లి, రామగుండం రీజియన్‌ ఏరియా సదస్సు గోదావరిఖనిలో నిర్వహించారు. ఆతర్వాత భూపాలపల్లి, కొత్తగూడెం రీజియన్‌లో నిర్వహించి ప్రభుత్వ తీరు ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement