గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల13న గోదావరిఖని విఠల్ నగర్ నుంచి ఆర్జీ –వన్ జీఎం కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాభాల బాటలో నడిచిన సింగరేణి సంస్థను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దివాళా తీయించే ప్రయత్నం చే స్తోందని ధ్వజమెత్తారు. కార్మికుల పిల్లలు ఉపాధి అ వకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలి పారు. కేసీఆర్ ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టి సుమారు 19వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కా ర్మికుల పిల్లల నోట్లో మట్టి కొడుతూ కారుణ్య ని యామకాలను రద్దు చేసేలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. 26 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా మనోవేదనకు గురిచేస్తోందన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరేందుకు ఎదురు చూస్తున్న సుమారు 400 మంది కార్మికుల పిల్లలకు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా యాజమా న్యం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ నాయకులు పర్లపెల్లి రవి, జేవీ రాజు, నాయకులు ఐ.సత్యం, వాసర్ల జోసెఫ్, పున్నం శశికుమార్, కో దాటి ప్రవీణ్, చింతకింది సంపత్, మద్దికుంట శంక ర్, గడపురం కల్యాణ్, మహేందర్‌రెడ్డి, కల్వల సాగర్, కందుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.


