కోల్‌సిటీ: ఏటా మేలో తన అందాలతో ప్రకృతి ప్రేమికులను మైమరపించే మే పుష్పం.. ఈసారి ఆలస్యంగా.. జూన్ నెలలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వికసించే ఈ విశిష్ట పుష్పం కోసం ప్రకృతిని ఆస్వాదించే వారు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనిని శాసీ్త్రయంగా స్కాడోక్సస్ మల్టీప్లోరస్ అంటారని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో మొ గ్గ తొడిగి, మే మొదటి లేదా రెండోవారంలో వికసించడం దీని ప్రత్యేకత. అందుకే దీనికి ‘మే పుష్పం’గా పేరు వచ్చింది. ఈసారి వాతావరణ పరిస్థితుల ప్ర భావంతో ఆలస్యంగా వికసించినట్లు స్థానికులు చె బుతున్నారు. గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లోని ఊ ర్వశి థియేటర్‌లో పనిచేస్తున్న నరేడ్ల రవీందర్ ఇంటి ఆవరణలో మే పుష్పం సుందరంగా విరబూసి చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.


