సత్వరమే అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సత్వరమే అర్జీల పరిష్కారం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. పలు అర్జీలను ఆయా శాఖల అధికారులకు రెఫర్‌ చేస్తూ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement