గోదావరిఖని: పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ డేగకన్ను వేసింది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఆవులు, దూడల అ క్రమ రవాణాను అడ్డుకునేక్రమంలో చట్టాన్ని చేతు ల్లోకి తీసుకునేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవా లని నిర్ణయించింది. ఈమేరకు రామగుండం పోలీ స్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ ఆదేశాలు జారీచేసింది. ఈనెల 27న బక్రీద్ నేపథ్యంలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. తనిఖీలు విస్తృతం చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో రాత్రింబవళ్లు వాహనాలు తనిఖీ చే స్తోంది. దండేపల్లి పరిధిలోని గూడెం, జన్నారం ప రిధిలోని ఇంద్రన్‌పల్లి, కోటపల్లి పరిధిలోని రాపన్‌పల్లి, జైపూ ర్ పరిధిలోని ఇంద్రారం, తాండూర్ పరిధిలోని రేపల్లెవాడ, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ టో ల్‌గేట్, సుల్తానాబాద్ పరిధిలోని దుబ్బపల్లి, సుల్తానాబాద్, గుంపుల చెక్‌పోస్టుల్లో సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. వీటితోపాటు ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
అక్రమ రవాణా నేరం
పశువుల అక్రమ రవాణా నేరం. అక్రమ రవాణాదా రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గోరక్షకుల పే రిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేసేవారిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. వాహనాలను ధ్వంసం చేసినా సహించం. సోషల్ మీడియాలో తప్పు డు ప్రచారం నమ్మవద్దు. పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 56597, డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి.
– అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం
పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులు


