తిరస్కరిస్తే అప్పీల్‌కు అవకాశం
కోల్‌సిటీ(రామగుండం): తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండం నగరంలోని ముబారక్‌నగర్, సప్తగిరికాలనీల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కమిషనర్ అరుణశ్రీతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందన్నారు. రామగుండం నగరంలోని 60 డివిజన్ల పరిధిలో 8 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, శుక్రవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు., ఈనెల 31న నామినేషన్ల పరిశీలన పూర్తిచేసి సరిగ్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించామని, 2న పరిష్కరిస్తామని, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన వివరించారు.


