అవకాశం వచ్చింది.. ఆలోచన చేయండి
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని: మంథని పరిరక్షణ, అభివృద్ధి కోసం మేధావులు ఆలోచించాలని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో పోచమ్మవాడలో 92, కూచిరాజ్‌పల్లిలో వందకుపైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పోచమ్మవాడలో నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయిస్తే ఆనాడు అనేక అడ్డంకులు పెట్టారని, స్థానికులు లేరంటూ ఫిర్యా దు చేశారని గుర్తుచేశారు. ఆగిపోయిన 17 ఇళ్లు 24నెలలు గడుస్తున్నా పేదలకు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు ఇస్తున్నారని అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు ఆలోచన చేయాలని కేసీఆర్ చెప్పినట్లుగా.. ప్రజలకు మంచిఅవకాశం వచ్చిందని ఆయన అన్నారు. నాయకులు తరగం శంకర్‌లాల్, ఏగోళపు శంకర్‌గౌడ్, అరెపల్లి కుమార్, కాయిత సమ్మయ్య, ఆకుల రాజబాపు తదితరులు పాల్గొన్నారు.


