
తాగునీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్
పెద్దపల్లిరూరల్: పట్టణ ప్రజలకు ఇకనుంచి రోజూ తాగునీరు సరఫరా చేయాలని, ఇందుకోసం ప్రణా ళిక సిద్ధం చేయాలని, తాగునీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ తొలగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వివి ధ అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి పనులు నా ణ్యంగా ఉండాలని, పురోగతి పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వీధుల్లో చీకటి ఉండొద్దని, అవసరమైతే కొత్తగా విద్యుత్ స్తంభాలు వే యించాలని సూచించారు. దోమల నివారణకు ఫా గింగ్ చేయాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్ తదితరులు ఉన్నారు. అనంతరం తెనుగువాడ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మట్టి విగ్రహాలు అందించారు.
‘టామ్‌కామ్’తో ఉపాధికి భరోసా
విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ‘టామ్‌కామ్’ను అందుబాటులోకి తీసుకొచ్చి యు వతలో భరోసా కల్పిస్తోందని కలెక్టర్ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్‌లో టామ్‌కామ్ కోర్సులపై అవగాహన కల్పించారు. విదేశీ నియామకదారులతో ఈ సంస్థను అనుసంధానం చేసి డాక్యుమెంటేషన్, ప్లేస్‌మెంట్, శిక్షణకు సహకరిస్తుందని తెలిపారు.