● అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ
పెద్దపల్లిరూరల్: మహిళా సంఘ సభ్యులు సీ్త్ర నిధి ద్వార పొందిన రుణాలు సద్వినియోగం చేసుకొని, సకాలంలో బకాయిలు లేకుండా చెల్లించాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం మెప్మా సీ్త్రనిధి ఆర్‌పీలతో సమావేశమై సమీక్షించారు. మైక్రో ఫైనాన్స్ వారిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో సీ్త్ర నిధి ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. పొందిన రుణాలను దీర్ఘకాలంగా పెండింగ్ ఉంచొద్దని సూచించారు. సమీక్షకు రాని రిసోర్స్‌పర్సన్‌లపై చర్యలకు ఆదేశించారు. బకాయిపడ్డ వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని, అవకతవకలు జరిగినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సంఘాల్లో లేనివారిని సభ్యులుగా చేర్చేందుకు కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, రీజినల్ మేనేజర్లు, రిసోర్స్‌పర్సన్‌లు పాల్గొన్నారు.
మార్చి ముగింపులోగా ఆస్తి పన్ను కట్టండి
కోల్‌సిటీ(రామగుండం): ఈ ఏడాది మార్చి నెల ముగింపులోగా ప్రజలు ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ రుసుం చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రజలు పన్నులు చెల్లించడానికి అన్ని సెలవు దినాల్లోనూ మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లు యథాతథంగాగా పని చేస్తాయన్నారు. వార్డు అధికారుల వద్ద చెల్లించే సౌలభ్యంతోపాటు మీసేవా కేంద్రాలు, మున్సిపల్ వెబ్‌సైట్, ఆన్‌లైన్‌లోనూ డిజిటల్ పేమెంట్ ద్వారా ఇంటి వద్ద నుంచి కూడా పన్ను కట్టవచ్చని తెలిపారు. పన్ను బకాయిదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.