న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2026
జనవరి 25 నుంచి
రెండో దశ జనగణన
జిల్లాలో 16వ జనగణన–2027 ప్రక్రియ రెండో దశను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పార్వతీపురంలో రహదరిని ఆనుకుని ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయాలు జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన దుకాణాల నుంచి మద్యం తీసుకెళ్లి గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు వ్యాపారులే సహకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లోనూ మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మద్యం అందుబాటును తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బెల్టు దుకాణాలను తొలగించినట్లు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక విక్రయాల ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం.
మద్యం వ్యాపారంలో సిండికేట్ల వ్యవహారం మరో చర్చనీయాంశంగా మారింది. దుకాణాల నిర్వహణలో కొందరు వ్యాపారులు పరస్పరం అవగాహనతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని, అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. మద్యం ధరలు, విక్రయాల తీరుపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నప్పటికీ ప్రజలపై పడుతున్న సామాజిక, ఆర్థిక ప్రభావాలను విస్మరించకూడదు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో మద్యం అందుబాటు పెరిగితే కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. రోజువారీ కూలి ఆదాయంలో కొంత భాగం మద్యానికే ఖర్చవుతోందని పలు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. ఇదే సమయంలో ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం, సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.
నేడు జాతీయ విద్యా దినోత్సవం
పార్వతీపురం రూరల్ : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీల సంక్షేమ దినోత్సవాలను జిల్లాలో అధికారికంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లోని ’సువర్ణముఖి’ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ రాష్ట్ర స్థాయి వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎం.సునీల్ కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలకు సిద్ధంకండి
● రాజాంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమీక్షించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్
రాజాం: రాజాంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజాంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీలోని పలువార్డులకు చెందిన కార్యకర్తలతో మంగళవారం సమీక్షించారు. నేడోరేపో రాజాం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తే విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతివార్డులో గెలుపుగుర్రాలను బరిలోకి దించాలని సూచించారు. అటు చైర్మన్‌తో పాటు ఇటు అన్ని కౌన్సిలర్ స్థానాలు దక్కించుకోవాలన్నారు. పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, పార్టీ పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు మాట్లాడారు. రాజాం మున్సిపాల్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
దళారుల ప్రమేయం వద్దు
విజయనగరం గంటస్తంభం: ఖరీఫ్ 2026–27 సీజన్ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమే యం లేకుండా చూడాలని, రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ డీఎం బి.శాంతి, వ్యవసాయ శాఖ జేడీ రామారావు సంబంధిత సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం సేకరణపై మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో వారు మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.2,441, గ్రేడ్–ఏ రకానికి రూ.2,461 మద్ద తు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నవంబర్‌లో 15 వేల మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 1.77 లక్షలు, జనవరిలో 1.68 లక్షలు, ఫిబ్రవరిలో 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పారు. దీనికోసం 80 లక్షల పాత గన్నీ బ్యాగులు, 53 లక్షల కొత్త గోనెసంచులు సమకూరుస్తున్నామని, కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, తేమ కొలిచే మీట ర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నవంబర్ 11 నుంచి మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు.
రైతు ఐడీ తప్పనిసరి..
ప్రభుత్వానికి ధాన్యం విక్రయించే ప్రతి రైతుకు ఆధార్‌తో లింక్ అయిన 20 అంకెల ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని జేడీ రామారావు స్పష్టం చేశారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ధాన్యం రవాణాకు మండ లాల వారీగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా నూరుశాతం పూర్తి చేయాలన్నారు. క్రాప్ కటింగ్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించి ఫారం–1 ఫ్లాట్ సెలెక్షన్‌ను రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాజాం డివిజన్లో కోతలు ప్రారంభమైనందున 15 రోజుల్లో సేకరణకు పరిస్థితులు అనుకూలిస్తాయని, విజయనగరం, కొత్తవలస ప్రాంతాల్లో డిసెంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు చేయా లన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమాని జిల్లాలో ఎప్పుడైనా, ఎక్కడైనా మద్యం దొరుకుతోంది. 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. రాత్రి 2 గంటలప్పుడు.. బెల్టు దుకాణం తలుపు తట్టినా.. మరుక్షణం మద్యం సీసా కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. ఇంటి పెద్ద సంపాదనలో సగం మద్యానికే పోస్తుండడం వల్ల ఆయా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 56 వరకూ ప్రైవేట్ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు సుమారు 600కు పైగా మద్యం బాటిళ్లు విక్రయం అవుతున్నాయి. మద్యం దుకాణాల ఏర్పాటు నుంచి విక్రయాల వరకు ఒకప్పుడు కొన్ని నిబంధనలు, నియంత్రణలు కనిపించేవి. ప్రధాన రహదారులు, కూడళ్లు, ఆలయాలు, విద్యాసంస్థలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారుల వెంబడే మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు గ్రామగ్రామాన బెల్టు దుకాణాల ద్వారా మద్యం అందుబాటులోకి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం అమ్మకాల నియంత్రణపై చర్చ మొదలైంది.
మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు ఆనుకుని, జనసంచారం ఉండే మార్గాల్లోనే దుకాణాలు కనిపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అటుగా వెళ్లే మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రుల సమీపంలో దుకాణాల ఏర్పాటుపై దూర పరిమితులు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు సంబంధించి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలకు వర్తించే మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని ప్రతి దుకాణం స్థానాన్ని అధికారులు పరిశీలించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ నిబంధనలు పాటిస్తున్నారు? ఎక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయి? అన్నది తేల్చాల్సిన బాధ్యత ఎకై ్సజ్ అధికారులపై ఉంది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై నియంత్రణ, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు నడిచేవి. దాన్ని రద్దు చేసి, చంద్రబాబు ప్రభుత్వం 2024 అక్టోబరులో కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఈ విధానంలో పార్వతీపురం మన్యం జిల్లాకు 56 దుకాణాలు కేటాయించారు. వీటిలో నాలుగు గీత కార్మికులకు, మిగిలిన 52 ఇతరులకు మంజూరు అయ్యాయి. ఇటీవలే వాటి లైసెన్సులను పునరుద్ధరించారు. ప్రైవేట్ దుకాణాల ఏర్పాటుతో మద్యం విక్రయాల విధానం మారింది. విక్రయాలపై ప్రభుత్వ నియంత్రణ, నిబంధనల అమలు ఎంతవరకు జరుగుతున్నాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో దుకాణాల ఏర్పాటు విషయంలో కనిపించిన జాగ్రత్తలు ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వీరఘట్టం:
ఏటా ఖరీఫ్ ఆరంభంలో తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక పంటల సాగుకు రైతులకు కష్టాలు ఎదురవుతాయి. ఆయకట్టు శివారు భూముల రైతులు ఆందోళనలు చేస్తూనే ఉంటారు. ఖరీఫ్ ముగిసిన సమయంలో సాగునీరు అందుతుంది. అప్పటి నుంచి అవసరం లేకపోయినా కాలువల్లో సాగునీరు ప్రవహిస్తూ పొలాలను ముంచెత్తుతుండడం రైతులకు కొత్తకష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రాజెక్టు వద్ద ఉన్న రెగ్యులేటర్లు మరమ్మతులకు గురికావడంతో కాలువలకు సాగునీరు రాకుండా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితం.. కోత కోసిన తర్వాత సాగునీరు వరి పనలను(ఓవులను) ముంచేస్తోంది. ఖరీఫ్ ఆరంభంలో నీరు అందక... ఖరీఫ్ చివరిలో పంట తడిసిపోకుండా రక్షించుకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు.
వృథాగా 0.3 టీఎంసీల నీరు
గత వారం రోజులుగా తోటపల్లి ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల సాగునీరు వృథా అవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, కుడి కాలువకు 120 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం నీరు అవసరం లేకపోయినా రెగ్యులేటర్లు పాడవ్వడంతో కాలువల్లో నీరు ప్రవహిస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి నీటి వృథాను అరికట్టాలని, అవసరం లేని సమయంలో నీరు బంద్ చేయాలని రైతులు కోరుతున్నారు.
మొరాయిస్తున్న షట్టర్లు...
ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని పాత కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను అరికట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో 2025 సెప్టెంబర్‌లో అధికారులు టెండర్లు పిలిచారు. అయితే, ఎవరూ పనులు చేసేందుకు టెండర్లు వేయకపోవడం రైతులకు శాపంగా మారింది.
తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. నీటిని నిలుపుదలచేయడం సాధ్యం కావడం లేదు. ఈ షట్టర్ల మరమ్మతుకు గతంలో రూ.18 లక్షలతో టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రాప్తికి ఈ షట్టర్ల మరమ్మతుకు రూ.40 లక్షలు అవసరం. అంచనా నివేదికను కలెక్టర్‌కు సమర్పించాం. ప్రభుత్వం నుంచి నిధులు, ఆదేశాలు వస్తే షట్టర్లు బాగుచేయిస్తాం. అంత వరకు నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతాం
– డి.వి.రమణ,
ఇరిగేషన్ ఏఈ, వీరఘట్టం
రహదారుల పక్కనే మద్యం దుకాణాలు
గ్రామగ్రామాన బెల్టు వ్యాపారం.. సిండికేట్ల అదనపు వసూళ్లు!
గతంలో జనావాసాలకు దూరంగా.. ఇప్పుడు రోడ్ల వెంబడే విక్రయాలు
మరమ్మతులకు గురైన తోటపల్లి సాగునీటి కాలువల రెగ్యులేటర్లు
అవసరం లేకపోయినా కాలువలకు నీరు
రూ.40లక్షలు విడుదలలో ప్రభుత్వం జాప్యం
ఆవేదనలో రైతాంగం


