గల్లంతైన యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యం

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

శ్రీకాకుళం రూరల్‌: పెదగనగళ్లవానిపేట సముద్రతీరంలో సోమవారం సాయంత్రం గల్లంతైన ఇద్దరు యువకుల్లో ఒకరి మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. మృతుడు భామిని మండలం గణసరి గ్రామానికి చెందిన గంగాధర మణికంఠగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజాం పట్టణానికి చెందిన గొల్లపల్లి మనోహర్‌ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement