● కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు
కొత్తవలస: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 13న ఇంటి నుంచి అదృశ్యమవగా ఆమె అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబసభ్యులు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా అది నచ్చక ఇంటి నుంచి యువతి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.13న ఆటో ఎక్కి విశాఖపట్నం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడినుంచి విజయవాడ వెళ్లినట్లు తెలిపారు. 14వ తేదీన పత్రికల్లో వచ్చిన వార్త ఆమె సెల్‌ఫోన్‌కు రావడంతో గ్రహించి తిరిగి గురువారం మండలానికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు.
దుర్గమ్మ సేవలో కేశలి అప్పారావు
విజయనగరం కల్చరల్(క్రైమ్): స్థానిక కానుకుర్తి వీధిలో శ్రీఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాలకు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మాజీ చైర్మన్ కేశలి అప్పారావు గురువారం హాజరై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమానికి ఆయన హాజరు కాగా ఆయనకు ఉత్సవ కమిటీ సాదరంగా ఆహ్వానించి, అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీఆదిభట్ల ఫౌండేషన్ ప్రతినిధి ఆనందనారాయణదాసు ఆయనను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.


