స్థానిక ఎన్నికలపై ఐజీపీ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలపై ఐజీపీ సమీక్ష

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

పార్వతీపురం రూరల్‌/విజయనగరం టౌన్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లపై విశాఖపట్నం రేంజ్‌ ఐజీపీ గోపీనాథ్‌ జెట్టి గురువారం నిర్వహించిన దూర దృశ్య సమీక్షా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏ ఆర్‌ దామోదర్‌, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పాల్గొన్నారు. రేంజ్‌ పరిధిలోని ఆరు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన ఈ భేటీలో స్థానిక పోరు భద్రతా చర్యలపై ఐజీపీ సమగ్రంగా చర్చించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని ఐజీపీ ఆదేశించారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేసి అదనపు బలగాల మోహరింపునకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి, చట్ట ప్రకారం బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు. పెండింగ్‌ నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. సిబ్బంది రాజకీయ ప్రభావాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, కోడ్‌ ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు భద్రతా చర్యలు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement