విజయనగరం ఫోర్ట్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కోడ్ ఈనెల 14వతేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం కూడా 14 వతేదీ నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయినప్పటికీ విజయనగరం పట్టణంలోని ఆర్అండ్బీ రైతు బజార్లో సీఎం, మంత్రుల ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీలు ఇంకా ఉంచడం గమనార్హం. అంతేకాకుండా ధరణి పేరుతో రాయితీపై సీఎం చంద్రబాబు, మంత్రుల ఫొటోలతో ముద్రించిన బియ్యం బస్తాలను కూడా విక్రయిస్తున్నారు. ఇది చూసిన వారంతా ఎన్నికల కోడ్ వీరికి వర్తించదా? అని గుసగుసలు ఆడుకుంటున్నారు.


