ఎన్నికల నియమావళి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళి పాటించాలి

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

ఎన్నికల నియమావళి పాటించాలి

విజయనగరం టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం,బహుమతులు, ఇతర వస్తువులు పంపిణీ చేయడం చట్టవిరుద్ధమని, అటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దన్నారు. ఓటువేయాలని, లేదా వేయవద్దని ఓటర్లపై ఒత్తిడి చేయడం, బెదిరించడం, భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడకూడదన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష తదితర అంశాల ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం, విద్వేషాలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదన్నారు. ఇతర అభ్యర్థులపై నిర్ధారణ లేని ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయకుండా ఎన్నికల ప్రచారంలో సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, లౌడ్‌ స్పీకర్లు వినియోగించడం , గోడలపై రాతలు రాయడం, అనధికారికంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలకు పాల్పడరాదని పేర్కొన్నారు. ఇతర అభ్యర్థుల ప్రచార సామగ్రిని చించివేయడం లేదా ధ్వంసం చేయడం చేయకూడదన్నారు సోషల్‌ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలు, మార్పింగ్‌ ఫొటోలు, వీడియోలు, అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేయరాదని సూచించారు. అనధికారంగా పెద్ద మొత్తంలో డబ్బులను వెంట తీసుకువెళ్లవద్దని, ఆన్‌లైన్‌ లావాదేవీలు మాత్రమే చేయడం శ్రేయస్కరమని ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో అనుమానాస్పదంగా నగదు, మద్యం , ఇతర వస్తువుల పంపిణీ జరుగుతున్నట్లు తెలిసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నా వెంటనే డయల్‌ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారమందించాలని కోరారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement