ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

● ఎస్పీ మాధవ్‌ రెడ్డి

● ‘మీ పోలీస్‌–మీకు తెలుసా’ విజేతలకు బహుమతులు

పార్వతీపురం రూరల్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమయస్ఫూర్తితో, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నమూనా ప్రవర్తనా నియమావళి అమలు, సున్నిత, అతి సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, ముందస్తు బైండోవర్‌ చర్యలు చేపడుతూ అల్లర్ల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతి, గంజాయి నియంత్రణ, రోడ్డు భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 37 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు.

‘మీ పోలీస్‌ – మీకు తెలుసా?’ విజేతలకు బహుమతులు..

విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ‘మీ పోలీస్‌ – మీకు తెలుసా?’ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, బహుమతులు పంపిణీ చేశారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రత, మహిళా రక్షణ తదితర అంశాలపై 21 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement