మాజీ ఎమ్మెల్యే మానవత్వం | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే మానవత్వం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

మాజీ ఎమ్మెల్యే మానవత్వం

● రోడ్డు ప్రమాద బాధితుడికి కళావతి సపర్యలు

● 108 సాయంతో ఆస్పత్రికి తరలింపు

పాలకొండ రూరల్‌: వైఎస్సార్‌సీపీ నాయకురాలు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఘటనా స్థలంలో సపర్యలు చేయడంతో పాటు 108కు సమాచారం అందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భామిని మండలం తాలాడకు చెందిన కొవ్వాడ మురళి అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై పాలకొండ వచ్చాడు. స్థానిక యాలాం కూడలి వద్ద సీతంపేట నుంచి శ్రీకాకుళం రహదారిలోకి వెళ్తున్న లారీ ముందు చక్రం మురళి ఎడమకాలి పాదంపై నుంచి వెళ్లిపోయింది. దీంతో పాదం పూర్తిగా నుజ్జునుజ్జయిది. ఈ సమయంలో భామిని నుంచి పట్టణంలోకి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కళావతి తన వాహనం నిలిపి, బాధితుడికి సపర్యలు చేశారు. తీవ్రగాయంతో విలవిల్లాడుతున్న మురళికి ధైర్యం చెప్పడంతో పాటు 108కి సమాచారం అందించారు. వాహనం అక్కడికి చేరుకునే వరకూ ఉండి క్షతగాత్రుడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో వైద్యులు బాధితుడిని శ్రీకాకుళం రిఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement