వెయిట్‌లిఫ్టింగ్‌లో గొళ్లు కుమార్‌కు స్వర్ణం | - | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టింగ్‌లో గొళ్లు కుమార్‌కు స్వర్ణం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

గంట్యాడ: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరుగుతున్న 39వ ఆలిండియా పోస్టల్‌ చాంపియన్‌షిప్‌లో లక్కిడాం గ్రామానికి చెందిన గొళ్లు కుమార్‌ ప్రతిభ చాటి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పోటీపడిన ఆయన స్నాచ్‌లో 115 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 150 కిలోలు చొప్పున మొత్తం 265 కిలోల బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి తన గ్రామానికి, ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చిన గొళ్లు కుమార్‌ను పలువురు క్రీడాకారులు, గ్రామ ప్రముఖులు అభినందించారు.

జాతీయ స్థాయి జూడో

పోటీలకు కొట్టక్కి విద్యార్థిని

రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన విద్యార్థిని రొంగలి మౌనిక జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు జిల్లా జూడో సంఘం ప్రతినిధి బి. రత్నకిషోర్‌ తెలిపారు. మౌనిక తిరుపతిలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌ 19 జూడో పోటీల్లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు మౌనికను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement