ఎన్నికల గాలం..! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల గాలం..!

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

–8లో

న్యూస్‌రీల్‌

–8లో

సేదదీరుతూ... సంచరిస్తూ..

మక్కువ మండలాన్ని గడిచిన పది రోజులుగా ఏనుగుల గుంపు వీడడం లేదు. పంటలను నాశనం చేస్తున్నాయి.

ఐదు దుకాణాల్లో చోరీ

చీపురుపల్లి పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో వరుసగా ఐదు దుకాణాల్లో జరిగిన చోరీ కలకలం రేపింది.

బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, పార్వతీపురం మన్యం:

ఎన్నికల వేడి మొదలవుతోందంటే చాలు.. నాయకుల్లో ఒక్కసారిగా కదలిక! నిన్నటి వరకు నత్తనడకన సాగిన పనులకు స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమానీ ఇప్పుడు వేగం పెరుగుతోంది. ఎక్కడ చూసినా శంకుస్థాపనలు.. మరెక్కడ చూసినా ప్రారంభోత్సవాలు.. ఇంకెక్కడో హామీల వర్షం! గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి హడావుడి ఊపందుకుంటోంది. ప్రజలపై నాయకులకు ఒక్కసారిగా ప్రేమ పొంగుకొస్తోంది. మరి ఈ ప్రేమ ఇన్నాళ్లూ ఏమైంది? ప్రజల సమస్యలు ఇప్పుడే గుర్తొచ్చాయా?

శంకుస్థాపనలు సరే.. పనుల సంగతేంటి?

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఫొటోలకు పోజులివ్వడం సాగుతోంది. సాలూరు పట్టణంలోని 28వ వార్డులో పైలట్‌ వాటర్‌ స్కీమ్‌ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇటీవల ప్రారంభించారు. వార్డులోని రామాలయం వద్ద నేలపై కూర్చొని స్థానికులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రూ.13 కోట్ల నిధులతో సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ దుగ్దసాగరం నుంచి వంగరగుడ్డివలస వరకు రోడ్డు, వట్టిగెడ్డ వంతెన నిర్మాణం కోసం మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పల్లెలు రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అంటున్నారు. బెలగాం నుంచి రాయగాడ రోడ్డు వరకు (డంపింగ్‌ యార్డ్‌ వరకు) దాదాపు రెండు కిలోమీటర్ల పైగా ఉన్న ప్రధాన రహదారి సంపూర్ణ పునర్నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నర్సిపురం ఎస్సీ వీధిలో రూ.10 లక్షలు, బీసీ కాలనీలో రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, ఓలేటి ఫామ్‌ అమ్మవారి పేరంటాలు గుడి వద్ద రూ.48 లక్షలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వివరించారు.

గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖర్జ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన–2 (పీఎంకేఎస్‌వై–2) పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి పంపిణీ చేశారు. ఇలా.. నిత్యం ఇలాంటి సీన్‌లే ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. శంకుస్థాపనలు చేయడమే అభివృద్ధికి కొలమానం కాదు.. ప్రకటించిన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని నిధులు విడుదలయ్యాయి? ఎన్ని ప్రజలకు ఉపయోగపడుతు న్నాయి? ఎన్ని ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయి? ఈ లెక్కలు బయటపడితేనే ప్రజాప్రతినిధుల అసలు నిజస్వరూపం వెలుగు చూస్తుంది. శంకుస్థాపన చేసిన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగాలి. తాగునీటి పథకం ప్రారంభిస్తే ఇంటింటికీ నీరు చేరాలి. డ్రైనేజీ పనులు చేపడితే మురుగునీటి సమస్య తీరాలి. అప్పుడే అభివృద్ధికి అర్థం ఉంటుంది.. జిల్లాలో ఈ రెండున్నర ఏళ్ల కాలంలో ఇలాంటి పనులు ఎన్ని సాఫీగా సాగాయో ఇటు ప్రజాప్రతినిధులకు, అటు ఆ ప్రాంత ప్రజలకు బాగానే ఎరుక.

ఇన్నాళ్లు నిర్లక్ష్యం.. ఇప్పుడెందుకీ హడావుడి?

ఇప్పుడే గుర్తొచ్చిన అభివృద్ధి.. గుర్తుకొస్తున్న ప్రజలు

గ్రామాలు, పట్టణాల్లో శంకుస్థాపనల సందడి..

నాయకుల హామీల హోరు

రెండున్నరేళ్లుగా కనిపించని చొరవ.. ఇప్పుడు మాత్రం వరాల జల్లు

పదవి కోసం పరిణయం

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండున్నరేళ్లుగా అంతగా కనిపించని చొరవ.. ఇప్పుడు కొన్నిచోట్ల స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల పనులకు హడావుడిగా శ్రీకారం చుడుతున్నారు. ప్రజాప్రతినిధుల పర్యటనలు పెరుగుతున్నాయి. అధికారుల సమీక్షలు, అభివృద్ధి ప్రకటనలు ఊపందుకుంటున్నాయి. ప్రజలకు అవసరమైన పనులు జరగడం ఆహ్వానించదగ్గదే. ప్రజల సమస్యలు ఎన్నికల వేళే ఎందుకు గుర్తుకొస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. ప్రజాసేవకు ఎన్నికల క్యాలెండర్‌తో సంబంధం ఉండాలా? ఐదేళ్ల పాలనలో ప్రతి రోజూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నాయకులు.. స్థానిక ఎన్నికల సమయం దగ్గరపడగానే ఎందుకు హడావుడి చేస్తున్నారు?. ఇదంతా ఎన్నికల డ్రామా అంటూ జనం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement