భూగర్భ జలాల కలుషితంపై సమగ్ర విచారణ | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల కలుషితంపై సమగ్ర విచారణ

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

● చిలకాంలో కిడ్నీ వ్యాధులతో ఇప్పటి వరకు 11 మంది మృతి

● తాగునీటి శాంపిల్స్‌ సేకరణ

గరుగుబిల్లి:

మండలంలోని చిలకాం గ్రామంలో భూగర్భ జలాలు కలుషితానికి గల కారణాలను గుర్తించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య, కార్యదర్శి శ్రీశరవణన్‌ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరుపుతామని విశాఖ జోనల్‌ సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ టి.సుదర్శనం తెలిపారు.

గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలను సందర్శించిన అధికారులు కిడ్నీ వ్యాధులతో మృతి చెందిన వారి వివరాలు, ప్రస్తుతం వ్యాధులతో బాధపడుతున్నవారు, డయాలసిస్‌ పొందుతున్న వారి సమాచారాన్ని సేకరించారు. తాగునీటి వనరుల శాంపిల్స్‌ సేకరణ, పేపర్‌ ప్లేట్‌ పరిశ్రమ అనుమతులను పరిశీలించారు. కిడ్నీ వ్యాధులు కారణంగా గ్రామంలో 11 మంది మృతి చెందిన నేపధ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరిపి, గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని సుదర్శనం వెల్లడించారు. పరిశీలనలో సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌లు వీరేంద్ర కుమార్‌, పి.శ్రీనివాసరావు, బి.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి శాంపిల్స్‌ను సేకరిస్తున్న బృంద సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement